News February 12, 2026
వనపర్తి: ‘కౌంటింగ్ కేంద్రంలోకి విలేకరులకు నో ఎంట్రీ’

వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితులలో విలేకరులను అనుమతించబోమని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి సీతారాం తెలిపారు. అక్రిడేషన్ కలిగిన విలేకరులకు మాత్రం మీడియా పాయింట్ వరకు అనుమతి ఉంటుందని, కౌంటింగ్ విజయవంతం అయ్యేందుకు మీడియా బాధ్యతతో సహకరించాలని ఆయన కోరారు.
Similar News
News March 13, 2026
GNT: గ్యాస్ వినియోగదారులకు హెల్ప్ లైన్ నెంబర్

గుంటూరు జిల్లాలో LPG కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. గ్యాస్ నిల్వలు తగ్గుతాయనే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ 8309160972, 6309520569 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరాలకు తగిన విధంగా సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని తెలిపారు.
News March 13, 2026
ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు: గుంటూరు DEO

వేసవి తీవ్రత దృష్ట్యా ఈ నెల 16 నుంచి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఒంటి పూట నిర్వహించాలని DEOసలీం భాష సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 8 నుంచి 12.30ని.ల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలను మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని అన్నారు.
News March 13, 2026
VZM: వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్‌లో కిల్లక లలిత ప్రతిభ

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా మార్చి 8 నుంచి నిర్వహిస్తున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో మన్యం జిల్లాకు చెందిన పారా క్రీడాకారిణి కిల్లక లలిత సత్తా చాటారు. T-11 కేటగిరికి సంబంధించి 400 మీటర్లు పరుగులో అద్భుతమైన ప్రతిభ కనబరచి సిల్వర్ మెడల్ సాధించిందని విజయనగరం అసోసియేషన్ అధ్యక్షులు కె. దయానంద్ శుక్రవారం తెలిపారు.


