News March 7, 2025
వనపర్తి: క్రీడలు ఆడే స్ఫూర్తి గొప్పది: ఎస్పీ

క్రీడలు ఆడే స్ఫూర్తి గొప్పదని, ప్రతి ఒక్కరు క్రీడలను ఆడుతూ మానసిక, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సిల్వర్ జూబ్లీ క్లబ్ వనపర్తి వారి ఆధ్వర్యంలో స్వర్గీయ కీ.శే నారమ్మ నర్సిరెడ్డి, బాదం పాండురంగయ్య స్మారకార్థం పురుషుల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
Similar News
News February 24, 2026
స్లీపింగ్ మాస్క్‌లు వాడుతున్నారా?

స్కిన్‌కేర్‌లో భాగంగా చాలామంది స్లీపింగ్ మాస్క్‌లు వాడటం ఎక్కువైంది. అయితే వీటిని ఎక్కువగా వాడటం నష్టమే అంటున్నారు నిపుణులు. ఈ మాస్కులు లైట్ క్రీమ్, జెల్‌తో ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. కానీ వీటిని రోజూ వాడటం వల్ల చర్మం ఎక్కువ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుందంటున్నారు నిపుణులు. సహజ తేమను కోల్పోయి, మొటిమలు వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. వారానికి 2సార్లు వాడటం మంచిదని సూచిస్తున్నారు.
News February 24, 2026
పత్తి విత్తనాల కొనుగోలు – రైతులకు సూచనలు

TG: పత్తి విత్తనాలను తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన లైసెన్స్ గల అధీకృత విత్తన డీలర్ల వద్ద మాత్రమే రైతులు కొనుగోలు చేసి, బిల్లు తప్పక అడిగి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో ఎక్కడైనా బిల్లు లేకుండా నకిలీ పత్తి విత్తనాలు, HT పత్తి, లూజు విత్తనాలను కలిగి ఉన్నా, అమ్ముతున్నా ఆ సమాచారాన్ని సంబంధిత మండల వ్యవసాయ అధికారికి లేదా 18005995779 (టోల్ ఫ్రీ) నంబర్‌కు కాల్ చేసి చెప్పండి.
News February 24, 2026
కళ్లు చెదిరే ధర.. గజం లక్షన్నర పైనే..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు బహిరంగ వేలంలో రికార్డు ధరలు పలికాయి. గచ్చిబౌలిలో చ.గజం ఏకంగా ₹1.76 లక్షలు, కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో ₹1.64 లక్షల ధర పలికినట్లు హౌసింగ్ బోర్డు MD VC గౌతమ్ తెలిపారు. గచ్చిబౌలి, బాచుపల్లి వంటి 14 ప్రాంతాల్లోని ప్లాట్ల కోసం నిర్వహించిన వేలంలో 50 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. సోమవారం నాటి విక్రయాల ద్వారా మొత్తంగా ₹34.27 కోట్ల ఆదాయం సమకూరింది.


