News March 27, 2025

వనపర్తి: క్రీడాకారులు, నిర్వాహకులను అభినందించిన ఎస్పీ

image

వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం క్రీడా మైదానంలో మెడికల్ విద్యార్థులకు నిర్వహించిన వార్షిక క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులతో పాటు, క్రీడల నిర్వాహకులను జిల్లా ఎస్పీ గిరిధర్ అభినందించారు. ఈ క్రీడల ద్వారా మీ శారీరక దేహ దారుఢ్యం మెరుగుపడుతుండటంతోపాటు, పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ కిరణ్మయి, వైద్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Similar News

News April 2, 2025

వేసవి సెలవులు.. కీలక ఆదేశాలు

image

TG: వేసవి సెలవులు ఇచ్చినా పలు ఇంటర్ కాలేజీలు క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంపై ఇంటర్ బోర్డు స్పందించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలు విద్యార్థులకు జూన్ 1 వరకు సెలవులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అనధికారంగా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు స్కిల్ డెవలప్‌మెంట్, సెల్ఫ్ స్టడీపై దృష్టి పెట్టాలని బోర్డు సూచించింది.

News April 2, 2025

హైదరాబాద్ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం

image

TG: హైదరాబాద్‌ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్ మండలంలోని ఓ కోళ్ల ఫారంలో 4రోజుల క్రితం వేలాది కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ వల్లే అవి మృత్యువాత పడినట్లు పరీక్షల్లో తేలింది. కోడి గుడ్లు, చికెన్ ఎవరికీ అమ్మొద్దంటూ ఆ పౌల్ట్రీ యజమానులను అధికారులు ఆదేశించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికెన్‌ను బాగా ఉడికించిన తర్వాతే తినాలని వారు సూచిస్తున్నారు.

News April 2, 2025

MBNR: ఖబర్దార్ రేవంత్ రెడ్డి: డీకే అరుణ

image

‘ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. హెచ్‌సీయూ భూములు వేలం వేయడం సరికాదు..ఆ భూములు ఎవరి జాగిరు కాదు’ అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. పరిపాలనలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

error: Content is protected !!