News March 28, 2025
వనపర్తి: గిరిజన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని వినతి

బంజారా గిరిజన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంఘాల నేతలు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు వినతిపత్రం ఇచ్చారు. వనపర్తి జిల్లా వాసి, బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి పదవి విషయంలో కేసీ వేణుగోపాల్‌తో చర్చించామన్నారు. తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. లేదంటే ఆందోళన చేస్తామని చెప్పామన్నారు.
Similar News
News November 28, 2025
మాజీ నక్సలైట్ సిద్ధన్న హత్య ఘటనాస్థలి పరిశీలించిన ఎస్పీ

పీపుల్స్ వార్ గ్రూపు మాజీ నక్సలైట్ సిద్దన్న అలియాస్ బల్లెపు నరసయ్య హత్యకు గురైన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే శుక్రవారం పరిశీలించారు. జగిత్యాలకు చెందిన జక్కుల సంతోష్ అనే వ్యక్తి యూట్యూబ్ ఇంటర్వ్యూ కోసం అని నమ్మించి సిద్ధన్నను అగ్రహారం గుట్టల్లోకి రప్పించి హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే వేములవాడ పోలీసులకు పలు సూచనలు చేశారు.
News November 28, 2025
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలలకు 35 కొత్త కంప్యూటర్లు

పెద్దపల్లి జిల్లా పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ 35 డెల్ వాస్ట్రో i3 కంప్యూటర్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. కలెక్టర్ అనుమతితో వచ్చిన ఈ కంప్యూటర్లు నవంబర్ 30లోపు సంబంధిత పాఠశాలలకు చేరేలా టీమ్‌లను ఏర్పాటు చేయాలని శాఖ ఆదేశించింది. పంపిణీ చర్యలపై వివరాల కోసం SIET సెక్షన్ అధికారి మల్లేష్ గౌడ్ (9959262737) ను సంప్రదించాలని ప్రకటించింది.
News November 28, 2025
కోటిలింగాల ఆలయానికి ₹2,73,695 ఆదాయం

కార్తీకమాసం ముగిసిన సందర్భంగా కోటిలింగాల కోటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి మొత్తం రూ.2,73,695 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ అధికారులు హామీ ఇచ్చారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజా మొగిలి, ఈవో కాంతరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేష్ పాల్గొన్నారు.


