News March 16, 2025
వనపర్తి: గ్రూప్ 3కి ఎంపికైన కృష్ణమూర్తిని సన్మానించిన ఎంపీ

టీజీపీఎస్సీ నిన్న ప్రకటించిన గ్రూప్ 3 ఫలితాల్లో స్టేట్ 364 ర్యాంకులు సాధించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ పూర్వ విద్యార్థిని పాలమూరు ఎంపీ డీకే అరుణ శనివారం అభినందించి సన్మానించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించిన కృష్ణమూర్తిని ఎంపీ అరుణ శాలువా పూలమాలతో సన్మానించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిన కృష్ణమూర్తిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ అన్నారు.
Similar News
News November 23, 2025
నల్గొండ: పున్నా కైలాస్ నేత రాజకీయ నేపథ్యం

మునుగోడుకు చెందిన పున్నా కైలాస్ నేత ఓయూలో చదువుకునే సమయంలోనే రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఓయూ విద్యార్థి నేతగా.. విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్లో చేరి 2018, 2023లో మునుగోడు MLA టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. 2022 నుంచి TPCC ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
News November 23, 2025
భద్రాద్రి జిల్లాలో శనివారం ముఖ్యాంశాలు

✓భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్న
✓దమ్మపేట: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 లారీలు సీజ్
✓కొత్తగూడెం 2టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ
✓కొత్తగూడెం: ఎన్కౌంటర్ బూటకమే: CPIML మధు
✓అనుమానిత వాహనాలు తనిఖీ చేసిన ఇల్లందు పోలీసులు
✓భద్రాచలం: ఇసుక లారీలతో ప్రజల ఇబ్బందులు
✓కొత్తగూడెం: 4 లేబర్ కోడ్ రద్దు చేయాలి: TUCI
✓సింగరేణిలో 1258 మంది ఉద్యోగులు పర్మినెంట్
News November 23, 2025
కుజ దోషం తొలగిపోవాలంటే?

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.


