News March 16, 2025
వనపర్తి: గ్రూప్ 3కి ఎంపికైన కృష్ణమూర్తిని సన్మానించిన ఎంపీ

టీజీపీఎస్సీ నిన్న ప్రకటించిన గ్రూప్ 3 ఫలితాల్లో స్టేట్ 364 ర్యాంకులు సాధించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ పూర్వ విద్యార్థిని పాలమూరు ఎంపీ డీకే అరుణ శనివారం అభినందించి సన్మానించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించిన కృష్ణమూర్తిని ఎంపీ అరుణ శాలువా పూలమాలతో సన్మానించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిన కృష్ణమూర్తిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ అన్నారు.
Similar News
News April 20, 2025
భార్య/భర్తల్లో ఈ లక్షణాలు ఉంటే..

ఈ లక్షణాలుంటే మీ పార్ట్‌నర్‌కు మీ మీద ఇంట్రెస్ట్ లేనట్టేనని, జాగ్రత్త పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*ఏ విషయాన్నీ డిస్కస్ చేయకపోవడం
*పాజిటివ్ విషయాలకూ చిరాకు పడటం
*ఫ్యూచర్ గురించి పట్టించుకోకపోవడం
*ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకపోవడం
*మీతో కాకుండా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా మాట్లాడుకోవడం
*కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడానికి కూడా దగ్గరకి రాకపోవడం
News April 20, 2025
ఎన్టీఆర్: LLM పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLM(మాస్టర్ ఆఫ్ లాస్) 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.
News April 20, 2025
NRPT: వేసవి తాపం తీర్చుకునేందుకు.. శీతల పానీయాలు

నారాయణపేట జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చలువ చేసే ద్రవపదార్థాలను తీసుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక చెరకు రసం, మజ్జిగ, లస్సీ, జ్యూస్, కొబ్బరి బోండాలు తాగేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ వేసవిలో వీటికి గిరాకీ ఉంది. ఈ కాలంలో లభించే కీరా, తాటి ముంజలు, కళింగ పండ్లకు డిమాండ్ ఉంది.