News March 12, 2025
వనపర్తి: చర్యలకు ఉపక్రమించిన మున్సిపల్ సిబ్బంది

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కచ్చా లేఅవుట్ లలో ఉన్న సరిహద్దు రాళ్ళు, ప్లాట్ల రాళ్ళను మంగళవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించినప్పటికీ సంబంధిత లే అవుట్ యజమానులు, ప్లాట్ల యజమానులు డబ్బులు కట్టకుండా సరైన స్పందన లేకపోవడంతో మున్సిపల్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
Similar News
News March 24, 2025
నాడు మోదీ చెప్పారు.. నేడు అమరావతిలోనూ అదే దోపిడీ: YCP

AP: అమరావతిలో రూ.27,159 కోట్ల విలువైన కాంట్రాక్టులను 3.94-4.34% అధిక ధరకు సొంత మనుషులకు CBN కేటాయించారని YCP ఆరోపించింది. ‘పోలవరాన్ని చంద్రబాబు ATM మాదిరి వాడుకుంటున్నారని మోదీ ఏ క్షణాన అన్నారో కానీ నేడు అమరావతిలోనూ అదే జరుగుతోంది. అప్పు తెచ్చిన డబ్బంతా అమరావతిలో పోసి 59 ప్యాకేజీల పనులను తమవాళ్లకు ఇచ్చుకున్నారు. అందులో కమీషన్లు నొక్కుతూ చంద్రబాబు సంపన్నుడు అవుతున్నారు’ అని ట్వీట్ చేసింది.
News March 24, 2025
ADB: కిషన్ రెడ్డిని కలిసిన MRPS జిల్లా అధ్యక్షుడు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో MRPS జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్న దండోరా ఉద్యమానికి మొదటి నుంచి అండగా ఉండి కేంద్ర పెద్దలను కిషన్ రెడ్డి ఒప్పించారని మల్లేశ్ అన్నారు. అనంతరం ఆయన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాలువతో సత్కరించారు.
News March 24, 2025
జీలుగుమిల్లి: వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేయించిన భార్య

జీలుగుమిల్లి (M) తాటియాకులగూడెంలో సంచలనం రేపిన గంధం బోస్ హత్య కేసులో ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. బోస్, శాంతకుమారిలు భార్యాభర్తలు. తన మేనమామ సొంగా గోపాలరావుతో శాంతకుమారి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో బోస్ అడ్డు తొలగించుకోవాలని గోపాలరావు, శాంతకుమారి ప్లాన్ వేశారు. నిద్రలో ఉన్న బోస్‌ను ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు.