News February 8, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News January 5, 2026
వారానికి 5 రోజులే పని చేస్తామని డిమాండ్.. కరెక్టేనా?

వారానికి 5 రోజులే పని చేస్తామని బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. UPIతో పనిభారం చాలా వరకు తగ్గిందని.. ఇప్పటికే రెండు, నాలుగో శనివారాలు సెలవులు ఉన్నాయి కదా అని పలువురు గుర్తు చేస్తున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ప్రొడక్టివిటీ పెంచేందుకు సెలవులు అవసరమని ఉద్యోగులు అంటున్నారు. వారానికి రెండు సెలవులతో బ్యాంకుల మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. COMMENT?
News January 5, 2026
మహిళల భద్రతకు ‘పోష్’ కమిటీలు తప్పనిసరి: కలెక్టర్

పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నివారించేందుకు ‘పోష్’ చట్టం-2013ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలని, అందులో సగం మంది మహిళలే ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ సంస్థలు నెల రోజుల్లోగా ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని గడువు విధించారు.
News January 5, 2026
గొర్రెల పెంపకం – సాంద్ర పద్ధతి అంటే ఏంటి?

సాంద్ర పద్ధతిలో గొర్రెలు ఎప్పుడూ పాకల్లోనే ఉంటాయి. వీటికి నిర్ణీత మోతాదులో పచ్చిగడ్డి, దాణాను ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. జీవాల లెక్కింపు, మందులు, టీకాలు వేయడం ఈ విధానంలో సులభంగా ఉంటుంది. పశుగ్రాసం వృథాకాదు. అయితే పాకలను పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్లలోనికి గాలి వెలుతురు సరిగా ప్రసరించేలా చూడాలి. పచ్చి పశుగ్రాసాలను చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా చేసి దాణా తొట్లలో అందించాలి.


