News February 8, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 28, 2026
NRPT: మార్చి 2న జాబ్ మేళా

నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మార్చి 2న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత శనివారం ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు కలశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని చెప్పారు. ఏడుకు పైగా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని అన్నారు.
News February 28, 2026
వేట్లపాలెం ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ బాధితులకు రూ. 50 వేల చొప్పున పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషాద సమయంలో కేంద్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
News February 28, 2026
VKB జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన దీపక్ తివారి

వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా దీపక్ తివారి బాధ్యతలు స్వీకరించారు. శనివారం జిల్లా అధికారులు నూతన కలెక్టర్‌కు స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ పరిపాలన యంత్రాంగాన్ని సరైన విధంగా నడిపిస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామంటూ అధికారులంతా కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.


