News February 8, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News March 24, 2025
అమరావతిలో 250 ఎకరాల్లో ప్రధాని సభ!

AP: రాజధాని అమరావతి పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన చేసేందుకు PM మోదీ వచ్చే నెల 15-20 తేదీల మధ్య రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖరారైనా పీఎంవో తేదీని ఫిక్స్ చేయలేదు. అయినప్పటికీ ప్రభుత్వం బహిరంగ సభ కోసం 250 ఎకరాల్లో సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకోసం వెలగపూడి సచివాలయం వెనుక ఎన్-9 రోడ్డు సమీపాన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 30న ఇక్కడే ఉగాది ఉత్సవాలు నిర్వహించనుంది.
News March 24, 2025
రాజమండ్రిలో తల్లీకుమార్తెలను హత్య చేసింది ఇతడే

రాజమండ్రి రూరల్ హుకుంపేట డీ బ్లాక్‌లో ఆదివారం తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో నిందితుడు పల్లి శివకుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా నిందితుడు ముళ్ల కంచెలలో నుంచి పరారవుతున్న సమయంలో కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి వెంబడించారు. నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ధైర్యసాహసాలతో ఎస్సై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
News March 24, 2025
GHMCలో 27 మంది ఇంజినీర్ల తొలగింపు

GHMC కమిషనర్ ఇలంబర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. GHMC టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న న్యాక్ అవుట్ సోర్సింగ్ 27 మంది ఇంజినీర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. క్రమశిక్షణ, అక్రమాలకు పాల్పడుతున్నవారితో చెడ్డపేరు వస్తుందని, వారిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. కొంతకాలంగా గ్రేటర్లో ఆక్రమణలపై ఇంజినీర్లు తనిఖీలు చేయకపోవడం, చేసినా చర్యలు తీసుకోకపోవడంతో తొలగించినట్లు తెలిపారు.