News February 8, 2025

వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News December 5, 2025

చలి ఉత్సవాలు జనవరికి వాయిదా: కలెక్టర్

image

డిసెంబర్‌లో జరగాల్సిన చలి ఉత్సవాలను జనవరి నెలాఖరుకు వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం మీడియా‌కు తెలిపారు. డిసెంబర్‌లో CM చంద్రబాబునాయుడు అందుబాటులో ఉండరని, ఈ కారణంగా చలి ఉత్సవాలు వాయిదా పడ్డాయన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని కలెక్టర్ కోరారు. ఏటా విశాఖలో జరిగే విశాఖ ఉత్సవాలు కూడా జనవరి నెలాఖరుకు వాయిదా పడ్డాయన్నారు.

News December 5, 2025

ప.గో: ఆర్టీసీకి 1,050 కొత్త బస్సులు

image

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి త్వరలో 1,050 కొత్త బస్సులు రానున్నాయని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గురువారం జంగారెడ్డిగూడెం డిపోను సందర్శించిన ఆయన మాట్లాడారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో సొంత, అద్దె బస్సులను ప్రవేశపెడతామన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీల ఆక్యుపెన్సీ పెరిగిందని ఎండీ తెలిపారు.

News December 5, 2025

పాలమూరు: ఆడపిల్ల పుడితే రూ.10 వేలు.. బాండ్ పేపర్

image

ఆడపిల్ల పుడితే రూ.10 వేలు, గ్రామంలో ఎవరైనా చనిపోతే అంతక్రియల నిమిత్తం రూ.5 వేలు ఇస్తామని మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బోరు కవిత రాసిన హామీ బాండ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనను గెలిపిస్తే ఇంటింటికి మరుగుదొడ్డి, విద్యార్థులకు సాయంత్రం ఉచిత తరగతులు, అన్ని వర్గాలకు కమ్యూనిటీ హాల్ తదితర 12 హామీలతో బాండ్ పేపర్ రాశారు. ఆమె BSC,B.ED పూర్తి చేసింది.