News February 8, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News April 16, 2026
WGL: తెర మీదకు పాత నియోజకవర్గ పేర్లు!

అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 నుంచి 18 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది.దీంతో పెరిగే నియోజకవర్గాలు ఏంటనే చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలు, గతంలో కనుమరుగైన నియోజకవర్గాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. శాయంపేట, ధర్మసాగర్, గుడూరు, చేర్యాల, హసన్‌పర్తితో పాటుగా కొత్తగా నెక్కొండ, కాజీపేట నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలంటున్నారు.
News April 16, 2026
టీడీపీ పదవుల్లో ‘పశ్చిమ’కు పెద్దపీట

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పోలిట్‌బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్‌లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్‌కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
News April 16, 2026
ORR అలైన్‌మెంట్‌పై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

AP: అమరావతి ORR నిర్మాణానికి సంబంధించి విజయవాడ ఆగ్నేయ, ఈశాన్య పరిధిలోని అలైన్‌మెంట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన PILపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ORR నిర్మాణం ఎక్కడ జరగాలో పిటిషనర్ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. నిపుణుల బృందం ఖరారు చేసిన అలైన్‌మెంట్లలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.


