News April 9, 2025

వనపర్తి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన మదనాపురం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అజ్జకొల్లుకి చెందిన పారశుద్ధ్య కార్మికుడు బాలకృష్ణకు అనారోగ్యం కారణంగా ఏడాది నుంచి పనికి వెళ్లట్లేదు. దీంతో తన తల్లి లక్ష్మి ఆ పనికి వెళ్లేది. ఆ జీతం యువకుడి అకౌంట్లో పడేవి.. తల్లి డబ్బులడగగా ఇవ్వకపోవటంతో ఆమె గొడ్డలితో అతడిపై దాడి చేసింది. గాయపడిని యువకుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

Similar News

News December 1, 2025

ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి: CM

image

TG: ఫ్యూచ‌ర్ సిటీ, మెట్రోరైల్ విస్త‌ర‌ణ‌, RRR, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాల‌కు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలని CM రేవంత్ హడ్కో ఛైర్మన్ సంజ‌య్ కుల‌శ్రేష్ఠ‌ను కోరారు. అత్య‌ధిక వ‌డ్డీతో ఇచ్చిన లోన్లను రీక‌న్‌స్ట్ర‌క్షన్ చేయాలన్నారు. మరో 10L ఇళ్ల నిర్మాణానికి రుణాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై హ‌డ్కో ఛైర్మ‌న్ సానుకూలంగా స్పందించారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, బుల్లెట్ ట్రైన్‌ అంశాలపైనా వారు చర్చించారు.

News December 1, 2025

‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్’ యాప్

image

TG: ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ID నంబర్‌తో కూడిన ‘భూధార్’ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. భూముల యాజమాన్య హక్కుల ఆధారంగా రైతులకు అందించనుంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే ‘mభూధార్’ ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. స్థానిక ఎన్నికల అనంతరం 2026 JAN నుంచి ఇవి పంపిణీ అవుతాయి. వీటితో భూ వివాదాల తగ్గుదల, సులభ లావాదేవీలు, డిజిటలైజేషన్, పథకాల సక్రమ అమలుకు అవకాశం ఉంటుంది.

News December 1, 2025

విపత్తుల సమయంలో ముందస్తు జాగ్రత్తలపై శిక్షణ: కలెక్టర్

image

విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్ది అన్నారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్టరేట్‌ ఆవరణలో రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక సేవల శాఖ పరికరాలను ఆయన పరిశీలించారు. విపత్తుల కోసం గ్రామస్థాయిలో వాలంటీర్లను ఏర్పాటుచేసుకొని వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.