News April 9, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన మదనాపురం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అజ్జకొల్లుకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బాలకృష్ణ అనారోగ్యం కారణంగా ఏడాది నుంచి పనికి వెళ్లట్లేదు. దీంతో తల్లి లక్ష్మి ఆ పనికి వెళ్లేది. ఆ జీతం యువకుడి అకౌంట్లో పడేవి. తల్లి డబ్బులడగగా ఇవ్వకపోవటంతో అతడిపై గొడ్డలితో దాడి చేసింది. గాయపడిని యువకుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
Similar News
News December 10, 2025
తాజా సినీ ముచ్చట్లు

* యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చేసేవాళ్లు కొన్నిరోజులు అక్కినేని నాగార్జున గారిపై పరిశోధనలు చేయాలి: విజయ్ సేతుపతి
* రోషన్ కనకాల-సందీప్ రాజ్ కాంబోలో వస్తున్న ‘మోగ్లీ’ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్
* రాబోయే ఐదేళ్లలో దక్షిణాదిన రూ.12 వేల కోట్లతో కంటెంట్‌ని సృష్టించబోతున్నట్లు ప్రకటించిన జియో హాట్ స్టార్
* ‘అన్నగారు వస్తారు’ నాకో ఛాలెంజింగ్ చిత్రం: హీరో కార్తి
News December 10, 2025
పల్నాడు: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు.?

టీడీపీ నేతల జంట హత్య కేసులో నిందితులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (ఏ7) గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోనున్నట్లు సమాచారం. రెండు వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
News December 10, 2025
పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్త్: రామగుండం సీపీ

మొదటి విడత పంచాయితీ పోలింగ్‌కు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు, గొడవలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.


