News April 9, 2025

వనపర్తి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన మదనాపురం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అజ్జకొల్లుకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బాలకృష్ణ అనారోగ్యం కారణంగా ఏడాది నుంచి పనికి వెళ్లట్లేదు. దీంతో తల్లి లక్ష్మి ఆ పనికి వెళ్లేది. ఆ జీతం యువకుడి అకౌంట్లో పడేవి. తల్లి డబ్బులడగగా ఇవ్వకపోవటంతో అతడిపై గొడ్డలితో దాడి చేసింది. గాయపడిని యువకుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

Similar News

News February 27, 2026

వదినమ్మకు ఆనంద్ దేవరకొండ అదిరిపోయే వెల్కమ్

image

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన వదినకు వెల్కమ్ చెప్పారు. ‘ఫ్యాన్స్ తనను కలిసినప్పుడల్లా ‘వదిన ఎలా ఉన్నారు?’ అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది’ అని ఆనంద్ సరదాగా పేర్కొన్నారు. అత్యంత దయగల, పాజిటివ్ పర్సన్ వదినగా రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ జంట ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని ఆకాంక్షించారు.

News February 27, 2026

తూప్రాన్: విద్యుదాఘాతంతో యువరైతు మృతి

image

తూప్రాన్ మండలం మల్కాపూర్ వద్ద విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు కొంతం మణికాంత్(23) గురువారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద విద్యుత్తు సరఫరాను పరిశీలిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో మణికాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు

News February 27, 2026

ముప్కాల్: మద్యం మత్తులో 100కు ఫోన్.. 10 రోజుల జైలు

image

మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన రేంజర్ల గ్రామానికి చెందిన సరుగుల ప్రేమ్ కుమార్‌కు ఆర్మూర్ కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. నిందితుడిని ముప్కాల్ పోలీసులు ఆర్మూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అత్యవసర సేవలకు ఆటంకం కలిగించినందుకు ఈ తీర్పునిచ్చినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. తప్పుడు సమాచారం లేదా అసభ్య ప్రవర్తనతో పోలీసుల సమయాన్ని వృథా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.