News March 17, 2025
వనపర్తి: చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి

వీపనగండ్ల మండల పరిధిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. కల్వరాలకు చెందిన నర్సింహ(62) నాన్చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. వెళ్లిన ఆయన ఎంతకు తిరిగి రాకపోవటంతో కుటుంబసభ్యులు చెరువులో గాలించగా ఆదివారం నర్సింహ మృతదేహం కనిపించింది. ఈమేరకు కేసు నమోదైంది.
Similar News
News November 4, 2025
ఆధార్ PVC కార్డును ఈజీగా అప్లై చేయండిలా!

ఆధార్ను PVC కార్డుగా మార్చుకుంటే ఎక్కువ మన్నికగా ఉంటుంది. పర్సులో పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. హోలోగ్రామ్, మైక్రో-టెక్స్ట్, సెక్యూర్ క్యూఆర్ కోడ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉన్న ఈ కార్డును ఆన్లైన్లో సులభంగా ఆర్డర్ చేసుకోవచ్చు. UIDAI <
News November 4, 2025
మెదక్: స్పెషల్ లోక్ అదాలత్ను వినియోగించుకోండి: ఎస్పీ

ఈనెల 15న జరిగే స్పెషల్ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు, కోర్ట్ డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ, ప్రతి పోలీస్ అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.
News November 4, 2025
ఏటూరునాగారం: ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్ మేళా

ఏటూరునాగారం ఐటీఐ కళాశాలలో ఈనెల 10న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదుకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు అప్రెంటిస్ మేళాలో హాజరవుతారన్నారు. వివిధ ట్రేడ్లలో అనుభవం, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 10న ఐటీఐ కళాశాలలో హాజరుకావాలని కోరారు.


