News March 24, 2025
వనపర్తి జిల్లాకు YELLOW ALERT..⚠️

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.
Similar News
News March 29, 2025
రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉగాది వేడుకలు

ఉగాది ఉత్సవాలను ఆదివారం ఉదయం గం.10.30ల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఎపీహెచ్‌ఆర్‌డీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
News March 29, 2025
ఎంపురాన్‌లో ఆ సీన్స్ కట్ చేస్తున్నాం: నిర్మాత

మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమాపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని నిర్మాత గోకులం గోపాల్ స్పందించారు. ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని దర్శకుడు పృథ్వీరాజ్‌కు సూచించినట్లు తెలిపారు. ఎంపురాన్ సినిమా ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలతోపాటు ఓవరాల్‌గా కథను ఒక వర్గాన్ని కించపరిచేలా తీశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News March 29, 2025
అవనిగడ్డ: IPL బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

అయ్యప్ప నగర్‌లో లోకేశ్ ఆత్మహత్యతో IPL బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో అవనిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంక్ ఖాతాల్లో లక్షలాది రూపాయలున్నట్లు గుర్తించారు. బుకీలను పట్టుకునేందుకు పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు.