News March 17, 2025
వనపర్తి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

వనపర్తి జిల్లాలో నిన్నటితో పోలిస్తే ఈరోజు ఉష్ణోగ్రతలు తగ్గినట్లు వాతావరణశాఖ తెలిపింది. నిన్న అత్యధిక ఉష్ణోగ్రత 41.3 డిగ్రీలు నమోదు కాగా, ఈరోజు40.7 డిగ్రీలు నమోదయింది. నిన్నటి కంటే 0.6 డిగ్రీలు తగ్గింది. గత 24 గంటల్లో (నిన్న ఉ.8.30 నుంచి నేడు ఉ.8.30 వరకు) వనపర్తిలోఅత్యధిక ఉష్ణోగ్రత40.7 డిగ్రీలు నమోదు కాగా, అత్యల్ప ఉష్ణోగ్రత పెబ్బేర్లో 38.7 డిగ్రీలు నమోదయింది.
Similar News
News December 6, 2025
పాలేరు జలాశయంలో మత్స్యకారుడు మృతి

కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేపల వేటకు వెళ్లి ఎర్రగడ్డ తండాకు చెందిన బానోత్ వాల్య(65)అనే మత్స్యకారుడు మృతి చెందాడు. తండావాసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన వాల్యకు చేపల వలలు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి పోయాడు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
News December 6, 2025
బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.
News December 6, 2025
ఖమ్మం: గ్రామాల్లో ‘బుజ్జగింపుల’ రాజకీయం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. తమ గెలుపుపై ప్రభావం చూపే బలమైన పోటీదారులను బ్రతిమిలాడి, బుజ్జగించి పోటీ నుంచి తప్పించేందుకు ప్రధాన అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఖర్చు ఇస్తామని ఆఫర్ చేస్తుంటే, మరికొందరు మొండిగా పోటీలో ఉంటామని చెబుతున్నారు.


