News March 24, 2025
వనపర్తి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..

వనపర్తి జిల్లాలో ఆదివారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. అత్యధికంగా పెబ్బేరులో 39.8℃ఉష్ణోగ్రత నమోదైంది. కొత్తకొండలో 38.6℃, విలియంకొండ 38.5, శ్రీరంగాపూర్ 38.1, పెద్దమందడి 37.6,వనపర్తి 37.5, అమరచింత 37.4, గోపాల్పేట 37.2, కేతేపల్లి 37.1, మదనాపూర్ 37, ఆత్మకూర్ 36.9, దగడ 36.6,ఘనపూర్ 36.5, రేమద్దుల 36.5, రేవల్లి 36.3, వీపనగండ్ల 36.2, సోలిపూర్, వెల్గొండ 36.1, పాన్గల్లో 35.6℃ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News December 2, 2025
PDPL: పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లపై సమీక్ష

కలెక్టర్ కోయ శ్రీ హర్ష పంచాయతీ ఎన్నికల పకడ్బందీ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రిటర్నింగ్, పోలింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు, నామినేషన్ల ప్రకటన, బ్యాలెట్ పేపర్ ముద్రణ, రవాణా సౌకర్యాలు, అభ్యర్థుల ప్రచార ఖర్చుల రిజిస్టర్ నిర్వహణ, ప్రతి మండలానికి బ్యాలెట్ బాక్స్ పంపిణీ వంటి అంశాలు చర్చించారు. పోలింగ్ కేంద్రాల్లో శాంతియుత వాతావరణం, సరైన లైటింగ్ ఉండేలా ఆదేశించారు.
News December 2, 2025
జగిత్యాల: ‘సైబర్ భద్రత ప్రతి పౌరుడి బాధ్యత’

సైబర్ భద్రత ప్రతి పౌరుని బాధ్యత అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ‘ఫ్రాడ్ క ఫుల్ స్టాప్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ బంజారా హిల్స్ ఆడిటోరియం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల గురించి రక్షించుకోవాలంటే అవగాహన తప్పనిసరి అని పేర్కొన్నారు.
News December 2, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

* కామారెడ్డి: పోస్టల్ బ్యాలెట్ కు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలి
* నాగిరెడ్డిపేట్: ముగిసిన రెండో విడత నామినేషన్ల పర్వం
* బిచ్కుంద: కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ బిజెపి నాయకులు
*లింగంపేట్: మండలంలో చిరుత పులి సంచారం
* గాంధారి: సోమారం సర్పంచ్ ఏకగ్రీవం
* బిక్కనూర్: కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
* మూడో విడత నామినేషన్లకు సర్వం సిద్ధం


