News April 11, 2025
వనపర్తి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

వనపర్తి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలిలా.. అత్యధికంగా దగడా, ఆత్మకూరులో 39.9 డిగ్రీలుగా నమోదైంది. అమరచింతలో 39.7, శ్రీరంగాపూర్ 39.6, పెబ్బేరు 39.5, విల్లియంకొండ, కానాయిపల్లి 39.4, గోపాల్పేట 39.3, వెలుగొండ 39.2, కేతేపల్లి 39.0, మదనాపూర్ 39.0, జానంపేట 38.9, వీపనగండ్ల, పానగల్ 38.7, సోలిపూర్ 38.6, ఘనపూర్ 38.0, వనపర్తి 37.9, రేమొద్దుల 37.9, రేవల్లి 37.3 డిగ్రీలుగా నమోదయ్యాయి.
Similar News
News December 4, 2025
జిల్లాలో తొలివిడతలో ఏకగ్రీవమైన పంచాయతీలు

జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 9 గ్రామపంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. రుద్రంగి మండలంలో పది పంచాయతీలకు గాను ఏడు పంచాయతీలలో సర్పంచు, వార్డు స్థానాలు పూర్తిగా ఏకగ్రీవం కాగా, కోనరావుపేట మండలంలో 28 పంచాయతీలకు గాను రెండు పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు. చందుర్తి, వేములవాడ, వేములవాడ రూరల్ మండలంలో ఒక పంచాయతీ కూడా ఏకగ్రీవం కాలేదు.
News December 4, 2025
ఇన్స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు ఇన్స్ట్రక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో వాసుదేవరావు తెలిపారు. అనపర్తి, రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం, సీతానగరం, రాజానగరం, కడియం పరిధిలోని పాఠశాలల్లో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ లోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.
News December 4, 2025
సర్పంచులకు 147, వార్డులకు 268 నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పర్వం మొదలైంది. 3వ విడతలో 4 మండలాల్లోని 87 సర్పంచులు, వార్డు సభ్యులకు సంబంధించి 762 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి 29 కేంద్రాల ద్వారా నామినేషన్లను స్వీకరించారు. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 147, వార్డు స్థానాలకు 268 నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.


