News March 20, 2025
వనపర్తి జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి.. !

వనపర్తి జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. బుధవారం అత్యధికంగా కనైపల్లిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెబ్బేరు, విలియంకొండలో 39.3 డిగ్రీలు, వనపర్తి 39.1, మదనాపూర్, వెల్గొండ 39, ఆత్మకూరు 38.8, రేమద్దుల, పెద్దమండడి, దగడ 38.7, పాన్గల్ 38.6, గోపాలపేట, రేవల్లి 38.5, వీపనగండ్ల 38.3, ఘనపూర్ 38.1, సోలిపూర్ 38, శ్రీరంగాపురం 37.9, కేతేపల్లి 37.7, జానంపేట 37.5, అమరచింతలో 37.4 డిగ్రీలు నమోదైంది.
Similar News
News March 28, 2025
నందిమల్ల: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

అమరచింత మండలంలోని నందిమల్ల గ్రామంలోని పెద్ద చెరువులో ఒక వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన నాగరాజ్ (30) శుక్రవారం చేపలు పట్టేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. బెండుపై కూర్చొని వల విసురుతుండగా ప్రమాదవశాత్తు బెండుపై నుంచి జారిపడి వలలో చిక్కుకొని మృతి చెందాడు. కాగా మృతునికి భార్య పావనితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
News March 28, 2025
అమరచింత, ఆత్మకూరు అక్రమ నిర్మాణాలపై హైకోర్టు నోటీసులు

వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత పట్టణాలలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో ఆత్మకూరుకు చెందిన సామాజిక కార్యకర్త బసిరెడ్డి సంతోష్ రెడ్డి పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పూజారి శ్రీలేఖ, అక్రమ నిర్మాణం, నాలాల ఆక్రమణ, అధికారుల నిర్లక్ష్యాన్ని సవాలు చేస్తూ వాదన కొనసాగింది. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి సురాయిపల్లి, రేణుక ఎరా ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.
News March 28, 2025
వనపర్తి: వాటిని మహిళా సంఘాలకు కేటాయించండి: కలెక్టర్

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అత్యధికంగా మహిళా సంఘాలకు కేటాయించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా ఉండేందుకు ఏఈవోల ద్వారా మహిళా సంఘాలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, ఈ శిక్షణలో వారు తప్పనిసరిగా పాల్గొనే విధంగా చూడాలని సూచించారు.