News February 19, 2025
వనపర్తి జిల్లాలో నాలుగువేల కోళ్లు మృత్యువాత

వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన ఓ రైతు కోళ్ల ఫామ్లో అకస్మాత్తుగా సుమారు 4వేల కోళ్లు మృతి చెందడంతో పెంపకందారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నట్టుండి కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ వచ్చిందా లేక ఇంకే కారణంతోనైనా చనిపోయాయా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు పరిశీలించి కారణమేమిటో గుర్తించి, ప్రభుత్వం తమను ఆదుకోవాలని పెంపకందారులు కోరుతున్నారు.
Similar News
News November 19, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 19, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.08 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 19, 2025
శుభ సమయం (19-11-2025) బుధవారం

✒ తిథి: బహుళ చతుర్దశి ఉ.8.29 వరకు
✒ నక్షత్రం: స్వాతి ఉ.7.49 వరకు
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ప.12.00-1.30 వరకు
✒ యమగండం: ఉ.7.30-9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-12.24 వరకు
✒ వర్జ్యం: మ.2.01-3.47
✒ అమృత ఘడియలు: రా.12.43-2.29
News November 19, 2025
సకాలంలో లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

భూసేకరణ కేసుల్లో పూర్తి డేటా సిద్ధం చేసి, ప్రజాభ్యంతరాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే మూడవ, నాలుగవ లైన్ భూసేకరణను వేగవంతం చేయాలని, పారిశ్రామిక పార్కుల్లో కొత్త యూనిట్ల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.


