News February 19, 2025

వనపర్తి జిల్లాలో నాలుగువేల కోళ్లు మృత్యువాత

image

వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన ఓ రైతు కోళ్ల ఫామ్‌లో అకస్మాత్తుగా సుమారు 4వేల కోళ్లు మృతి చెందడంతో పెంపకందారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నట్టుండి కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ వచ్చిందా లేక ఇంకే కారణంతోనైనా చనిపోయాయా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు పరిశీలించి కారణమేమిటో గుర్తించి, ప్రభుత్వం తమను ఆదుకోవాలని పెంపకందారులు కోరుతున్నారు.

Similar News

News March 15, 2025

ఎర్రుపాలెం: అప్పులు బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పులు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మొలుగుమాడుకి చెందిన తోట వెంకటేశ్వరరావు అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. పంట సరిగా పండకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 15, 2025

సిరిసిల్ల: పండుగ పూట విషాదం.. నలుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లాలో శుక్రవారం వేర్వేరు ఘటనలో నలుగురు చనిపోయారు. PDPL జిల్లా కమాన్‌పూర్(M) గుండారంకు చెందిన ఓదెలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. JGTL రూరల్(M) వెల్దుర్తిలోని కెనాల్‌లో ఈతకు వెళ్లి సాగర్‌గౌడ్ చనిపోయాడు. KNR జిల్లా ఇల్లందకుంట(M) చిన్నకోమటిపల్లిలో బైక్ అదుపుతప్పి JMKTకు చెందిన అనుదీప్ మృతిచెందాడు. SRCL జిల్లా చందుర్తికి చెందిన <<15754680>>వామిక<<>> అనే 16 నెలల చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది.

News March 15, 2025

పెద్దపల్లి: పండుగ పూట విషాదం.. నలుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న వేర్వేరు ఘటనల్లో నలుగురు చనిపోయారు. PDPL జిల్లా కమాన్‌పూర్(M) గుండారానికి చెందిన ఓదెలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. JGTL రూరల్(M) వెల్దుర్తిలోని కెనాల్‌లో ఈతకు వెళ్లి సాగర్‌గౌడ్ చనిపోయాడు. KNR జిల్లా ఇల్లందకుంట(M) చిన్నకోమటిపల్లిలో <<15762521>>బైక్<<>> అదుపుతప్పి JMKTకు చెందిన అనుదీప్ మృతిచెందాడు. SRCL జిల్లా చందుర్తికి చెందిన వామిక అనే 16 నెలల చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది.

error: Content is protected !!