News March 17, 2025
వనపర్తి జిల్లాలో మండుతున్న ఎండలు

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అత్యధికంగా కానాయిపల్లిలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెబ్బేరు 42.1, విలియంకొండ 41.6, పెద్దమందడి 41.1, వనపర్తి 40.7, రేమద్దుల 40.7, గనపూర్ 40.4, వెలుగొండ 40.4, రేవల్లి 40.3, ఆత్మకూర్ 40.3, మదనపూర్ 39.9, దగడ 39.9, పాన్గల్ 39.6, సోలిపూర్ 39.6, గోపాల్ పేట 39.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News January 7, 2026
అబార్షన్ అయిందా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి

వివిధ కారణాల వల్ల కొన్నిసార్లు అబార్షన్ కావొచ్చు. దీని తర్వాత ఆ మహిళ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. డాక్టర్లు సూచించిన మందులు వాడాలి. రెండు వారాలకు మీరు మామూలుగా ఇంటి పనులు, వ్యాయామం, యోగా మొదలుపెట్టవచ్చు. అయితే అబార్షన్ తర్వాత నెలసరి అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంది. 3నెలలపాటు మల్టీవిటమిన్ మాత్రలు తీసుకోవాలి. మానసికంగా, శారీరకంగా పూర్తిగా కోలుకున్న తరువాతే ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించాలి.
News January 7, 2026
సంగారెడ్డి: అల్పాహారం నిధులు విడుదల

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల వేళ అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని సంగారెడ్డి డీఈఓ తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు అల్పాహారం అందించాలని, ఇందుకోసం జిల్లాకు రూ. 26,14,590 మంజూరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
News January 7, 2026
NPCILలో 114 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL) 114 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ/టెక్నీషియన్, X-RAY టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు JAN 15 నుంచి ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.npcilcareers.co.in


