News April 14, 2025

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన నిన్న పాన్‌గల్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అన్నారం, దావాజీపల్లి గ్రామాల మధ్య పాన్‌గల్‌ వాసి ఆర్ఎంపీ స్వాములు, నాగవరం వాసి నాగేంద్ర ఇద్దరు బైకులు ఎదురెదుగా వచ్చి ఢీకొట్టుకున్నారు. ఈ ప్రమాదంలో నాగేంద్రకు తీవ్రగాయాలు కావటంలో వనపర్తి ఆసుపత్రికి తరలించారు. ఆర్ఎంపీ కాలు విరగటంతో కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 28, 2025

మంచిర్యాల జిల్లాలో సర్పంచి స్థానాలకు 99 నామినేషన్లు

image

మంచిర్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతోంది. శుక్రవారం 90 సర్పంచ్ స్థానాలకు 99 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 816 వార్డులకు 222 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ, 11న పోలింగ్ జరగనుంది.

News November 28, 2025

MDK: రెండో రోజు 152 సర్పంచ్, 186 వార్డు నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల స్వీకరణలో సర్పంచ్ స్థానాలకు 152, వార్డు సభ్యుల స్థానాలకు 186 నామినేషన్లు వచ్చాయి. అల్లదుర్గ్ 14, హవేలీఘనపూర్ 49, పాపన్నపేట్ 25, రేగోడు 18, శంకరంపేట్(ఏ) 17, టేక్మాల్ 29 సర్పంచ్ నామినేషన్లు స్వీకరించారు. వివరాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు.

News November 28, 2025

వనపర్తిలో 780 వార్డులకు 276 నామినేషన్లు

image

వనపర్తి జిల్లాలో మొదటి విడత జరగనున్న 87 గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని మొత్తం 780 వార్డులకు రెండు రోజుల్లో 276 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 250 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
మండలాల వారీగా వివరాలు:
ఘనపూర్: 90
పెద్దమందడి: 83
రేవల్లి: 51
గోపాల్‌పేట: 19
ఏదుల: 07