News April 2, 2025

వనపర్తి జిల్లాలో 1,59,353 రేషన్ కార్డులు: అదనపు కలెక్టర్ 

image

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 1,59,353 తెల్ల రేషన్ కార్డులు ఉండగా 5,22,367 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్న రకం బియ్యం ఉచితంగా ఇవ్వనున్నామన్నారు. దీనికోసం జిల్లాలో 3,309 మెట్రిక్ టన్నుల సన్న రకం బియ్యం అవసరమన్నారు. జిల్లాలోని 324 చౌక ధర దుకాణాల్లో సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Similar News

News April 4, 2025

ఒకేసారి ఆస్తి పన్ను చెల్లిస్తే 5% రాయితీ

image

AP: 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒకేసారి ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఈ నెల 30లోగా చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.

News April 4, 2025

ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన ఖమ్మం CP

image

ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో భాధ్యతలు నిర్వహిస్తున్న ఇటీవల హెడ్ కానిస్టేబుల్ బి.పాపా మరణించారు. కాగా హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రూ.8 లక్షల భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు మంజూరైంది. శుక్రవారం ఖమ్మం సీపీ సునీల్ దత్ బాధిత కుటుంబానికి మంజూరైన చెక్కును అందజేశారు. శాఖాపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైనా పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని సీపీ పేర్కొన్నారు.

News April 4, 2025

గాంధారి మండలంలో అదనపు కలెక్టర్ తనిఖీ

image

కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చందు నాయక్ గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పథకం, ఉపాధి పనులను లబ్ధిదారులకు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధారి ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీఓ లక్ష్మీనారాయణ, గ్రామ కార్యదర్శి ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!