News April 2, 2025
వనపర్తి జిల్లాలో 1,59,353 రేషన్ కార్డులు: అదనపు కలెక్టర్

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 1,59,353 తెల్ల రేషన్ కార్డులు ఉండగా 5,22,367 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్న రకం బియ్యం ఉచితంగా ఇవ్వనున్నామన్నారు. దీనికోసం జిల్లాలో 3,309 మెట్రిక్ టన్నుల సన్న రకం బియ్యం అవసరమన్నారు. జిల్లాలోని 324 చౌక ధర దుకాణాల్లో సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News April 20, 2025
మానవ తప్పిదాలు, అజాగ్రత్తతోనే ప్రమాదాలు: ఎస్పీ

మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యలయంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారి వెంట ఉండే గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, హెల్మెట్ ధరించాలి, సీటు బెల్ట్ పెట్టుకోవాలి, అధిక వేగంతో వాహనం నడపొద్దన్నారు.
News April 20, 2025
భీమదేవరపల్లిలో త్రికుటేశ్వర స్వామి ఆలయం!

కాకతీయులు 12వ శతాబ్దంలో నిర్మించిన త్రికుటేశ్వర స్వామి ఆలయం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారంలో ఉంది. ఈ ఆలయం హనుమకొండ వేయి స్తంభాల గుడి ఆకారాన్ని పోలి ఉంది. కాకతీయులు ఈ ఆలయాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆలయం భక్తుల దర్శనార్థం పునర్ నిర్మించబడింది. ఇక్కడ శివుడు త్రికుటేశ్వర రూపంలో మూడు దిక్కుల భక్తులకు దర్శనమిస్తారు.
News April 20, 2025
జిల్లాలో మంచిని సమస్య లేకుండా చూడండి: రాజనర్సింహ

జిల్లాలో మంచినీటి సమస్య లేకుండా చూడాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా మంచిది సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.