News March 10, 2025

వనపర్తి జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అత్యధికంగా కానాయిపల్లిలో 40.7° ఉష్ణోగ్రత నమోదయింది. పానగల్ 40.4, విలియం కొండ 39.2, వెలుగొండ 39.0, దగడ 38.9, కేతపల్లి 38.6, పెబ్బేరు 38.4, మదనపూర్ 38.3, వనపర్తి 38.0, గోపాల్ పేట 37.8, ఆత్మకూర్ 37.8, ఘన్పూర్ 37.5, వీపనగండ్ల 37.4, శ్రీరంగాపూర్ 37.3, జానంపేట 37.3, రేవల్లి 37.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News December 1, 2025

‘108’ సంఖ్య విశిష్టత

image

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.

News December 1, 2025

SBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

SBIలో 15 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో 5 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, 10 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు వేర్వేరుగా అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in

News December 1, 2025

పార్లమెంట్ సమావేశాలు.. బండి సంజయ్ గొంతెత్తుతారా? లేదా?

image

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. KNR పార్లమెంట్‌ స్థానానికి కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించడంపై బండి సంజయ్ మాట్లాడితే BJPకి ఎంతోకొంత మేలు జరగనుంది. ఇక జిల్లాలో ఇసుక మాఫియా వల్ల చెక్‌ డ్యాంలకు జరుగుతున్న నష్టం, కూల్చివేత అంశాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అంతా కోరుతున్నారు.