News April 15, 2025
వనపర్తి జిల్లాలో TODAY TOP NEWS

✔️అమరచింత: సాగునీరు కావాలంటూ రైతుల రాస్తా రోకో కార్యక్రమం. ✔️ WNP: GREAT పోలీస్… యువకుడి ప్రాణాలు కాపాడారు. ✔️ రేవల్లి: పొట్టేళ్ల బండి పై స్వారీ చేసిన మాజీ మంత్రి. ✔️ WNP: పాలిటెక్నిక్ చౌరస్తా వద్ద డివైడర్లు ఏర్పాటు. ✔️ WNP: POCSO యాక్ట్ పై అవగాహన
✔️పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి
Similar News
News October 25, 2025
పటాన్‌చెరు: ఓఆర్‌ఆర్ వద్ద గంజాయి స్వాధీనం

పటాన్‌చెరు మండలం ముత్తంగి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) వద్ద శనివారం పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై అసిఫ్ తనిఖీలు చేస్తుండగా దుస్తుల్లో 10 కిలోల గంజాయిని తరలిస్తున్న సంతోష్ మధుకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
News October 25, 2025
తిరుపతి: జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ రద్దు

మొంథా తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించే PGRS రద్దు చేసినట్లు తిరుపతి కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. అన్ని జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు “మొంథా” తుఫాను కారణంగా సహాయకచర్యలలో ఉన్నారని తెలిపారు. ప్రజలెవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సోమవారం నాటి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
News October 25, 2025
రంప: ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు

విద్యార్థులు మానసిక, ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని రంపచోడవరం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య ఆశ్రమ ఉన్నత పాఠాశాలల హెచ్‌ఎంకు సూచించారు. శనివారం జడ్డంగి, తాళ్ళపాలెం (రాజవొమ్మంగి) గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను చూశారు. విద్యార్థినీ, విద్యార్థులుతో మాట్లాడారు. హెచ్‌ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులు ఉన్నారు


