News February 25, 2025
వనపర్తి జిల్లా ఉష్ణోగ్రత వివరాలు

గడిచిన 24 గంటల్లో వనపర్తి జిల్లాలో అత్యధికంగా పెబ్బేర్‌లో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాన్గల్ 36.2, కేతేపల్లి 36.1, ఆత్మకూర్ 36.1, శ్రీరంగాపూర్ 36.0, కానాయిపల్లి 36.0, అమరచింత 35.9, వెలుగొండ 35.9, విలియంకొండ 35.8, మదనపూర్ 35.7, జానంపేట 35.7, వీపనగండ్ల 35.7, దగడ 35.6, రేమద్దుల 35.4, ఘన్పూర్ 35.3, వనపర్తి 35.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతల నమోదయ్యాయి.
Similar News
News February 25, 2025
మహిళలకు అండగా సఖి వన్ స్టాప్ సెంటర్: ఎస్పీ

మహిళలకు అండగా “సఖి వన్ స్టాప్ సెంటర్” ఉంటుందని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జీజీహెచ్ ఆవరణలో ఉన్న”సఖి వన్ స్టాప్ సెంటర్”ను మంగళవారం ఎస్పీ సందర్శించారు. ఈ సెంటర్‌లోని కేంద్ర నిర్వాహణ గది, పోలీస్ సలహాదారు గది, రెసెప్షన్, తాత్కాలిక వసతి కౌన్సిలింగ్ రూమ్‌లను ఎస్పీ తనిఖీ చేశారు.
News February 25, 2025
ఏపీ అసెంబ్లీ వాయిదా

ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఈ తీర్మానానికి ఆమోదం లభించినట్లు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ తర్వాత ఫిబ్రవరి 28కి సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
News February 25, 2025
భారీ భద్రతలతో పోలింగ్: కలెక్టర్

భారీ భద్రతలతో ఎమ్మెల్సీ ఎన్నిలక పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. 8 మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 37 మంది ఎస్సైలు, 69 మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, 221 మంది పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర భధ్రతా సిబ్బందితో కలిసి 477 మందిని పోలింగ్ ప్రక్రియకు వినియోగించనున్నట్లు తెలిపారు. 70 మంది జోనల్ అధికారులను, 99 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు.