News March 25, 2025
వనపర్తి జిల్లా ఎండ తీవ్రత ఇలా..

వనపర్తి జిల్లాలో సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. పెబ్బేరు, కేతేపల్లిలో 38.4℃, దగడ 38.3, విలియంకొండ 38.2, గోపాలపేట 38.1, పెద్దమండడి, రెమడ్డుల, కనైపల్లి 38, పాన్గల్ 37.8, మదనాపూర్, ఘనపూర్ 37.7, రేవల్లి 37.6, అత్మకూరు, వనపర్తి 37.5, శ్రీరంగాపురం, జానంపేట 37.3, వెల్గొండ, సోలిపూర్ 37.2, అమరచింత 36.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. గత వారంలో తీవ్రమైన ఎండలు ఉండగా.. గత రెండు రోజులుగా తక్కువగా ఉంటున్నాయి.
Similar News
News February 23, 2026
అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులు వచ్చే ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, అందువల్ల అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారంలో పర్యవేక్షణ లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 23, 2026
వనపర్తి: భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

రెవెన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తహశీల్దార్లను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, “జీరో పెండెన్సీ” లక్ష్యంతో పని చేయాలని సూచించారు. రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి దరఖాస్తును క్లియర్ చేయాలని స్పష్టం చేశారు.
News February 23, 2026
విజయనగరం: ఏసీబీకి చిక్కిన వీఆర్వో

విజయనగరం జిల్లా భోగాపురం మండలం చాకివలసకు చెందిన రైతు లెంక బంగారు నాయుడు వద్ద, వీఆర్ఓ చిట్టి బాబు రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. భూములు మ్యూటేషన్ పనులకు రైతు నుంచి రూ.3 లక్షలు వీఆర్ఓ డిమాండ్ చేయగా రూ. లక్షకు బేరం కుదిరినట్లు రైతు తెలిపారు. మనస్తాపానికి గురై ఏసీబీ అధికారులను ఆశ్రయించానని అన్నారు. సోమవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా వీఆర్వోను పట్టుకున్నారు.


