News March 20, 2025
వనపర్తి జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

వనపర్తి జిల్లాలో స్థానిక అవసరాల మేరకు ఇసుక వాడుకోవడానికి అందుబాటులో ఉన్న రీచ్‌లను వెరిఫై చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌లపై పలు సూచనలు చేశారు.
Similar News
News April 20, 2025
మోత్కూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

మోత్కూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. అనాజిపురం-దాచారం గ్రామాల మధ్య ఉన్న పత్తి మిల్లు వద్ద బైక్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంపటికి చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
HYD: రెసోనెన్స్ విద్యార్థుల జయకేతనం

JEE మెయిన్స్-2025 ఫలితాలలో రెసోనెన్స్ విద్యార్థులు సత్తా చాటారు. మెయిన్స్‌లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. అర్చిస్మాన్ అనే స్టూడెంట్ 295 స్కోర్ చేయడంతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ 13 వచ్చిందన్నారు. మొత్తం 285 మంది విద్యార్థులు విభిన్న సబ్జెక్టుల్లో 99 పర్సెంటైల్ పైగా మార్కులు సాధించారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం సన్మానించింది.
News April 20, 2025
రేపు వనపర్తిలో ప్రజావాణి రద్దు

ఈనెల 26వ తేదీ వరకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమం ఉంటాయని వనపర్తి కలెక్టర్ ఆదర్స్ సురభి తెలిపారు. ఈ విషయమై రేపు కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఇది గమనించాలని సహకరించాలని కోరారు.