News March 22, 2025

వనపర్తి జిల్లా కలెక్టర్ WARNING

image

అనుమతిలేని, అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 31 వరకు ఎల్.ఆర్.ఎస్ క్రమబద్ధీకరణ చేయించుకునే వారికి 25 శాతం రాయితీ ఇస్తామన్నారు. గడువు ముగిసిన తర్వాత అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Similar News

News September 17, 2025

HYDలో జాతీయ జెండా ఆవిష్కరించిన కవిత

image

తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఎంకే. మొయినుద్దీన్‌ని శాలువా పూలమాలలతో సత్కరించారు.

News September 17, 2025

గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ

image

TG: గ్రూప్-1 మెయిన్స్‌ <<17655670>>ఫలితాలను<<>> రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ నెల 9న ఫలితాలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

News September 17, 2025

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం: డిప్యూటీ సీఎం

image

ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నిలబెట్టుకుంటోందని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి స్పష్టం చేశారు.