News March 22, 2025

వనపర్తి జిల్లా కలెక్టర్ WARNING

image

అనుమతిలేని, అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 31 వరకు ఎల్.ఆర్.ఎస్ క్రమబద్ధీకరణ చేయించుకునే వారికి 25 శాతం రాయితీ ఇస్తామన్నారు. గడువు ముగిసిన తర్వాత అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Similar News

News April 21, 2025

కంచిలిలో వ్యవసాయ పరికరాలు పంపిణీ 

image

కంచిలి మండలంలో సబ్ మిషన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం కింద వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే బెందాళం అశోక్,  కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్  అందజేశారు. అనంతరం ఈ పథకం కింద నిర్మించిన వ్యవసాయ గోడౌన్‌ను ప్రారంభించారు. ఈ ఆధునిక పరికరాలు రైతుల వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని చెప్పారు. 

News April 20, 2025

MBNR: 22ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

image

అడ్డాకుల మండల పరిధిలోని శాఖపూర్‌లో 2002-2003 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, గురువులకు మెమెంటోలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణవర్ధన్ గౌడ్, కేశవర్ధన్ గౌడ్, రాజేష్, నరేందర్ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

News April 20, 2025

గాజువాకలో బెట్టింగ్ ముఠా అరెస్ట్ 

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ పర్యవేక్షణలో బెట్టింగ్ ముఠాను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గాజువాక పరిధిలో బీహెచ్‌పీవీ వద్ద బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం రావడంతో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 23 సెల్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతుందో ఆరా తీస్తున్నారు. కమిషనర్ ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ఈ దాడులు చేసింది.

error: Content is protected !!