News April 3, 2025
వనపర్తి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 30 వరకు “30 పోలీస్ ఆక్ట్” అమల్లో ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
Similar News
News November 20, 2025
HYD: కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు: చనగాని

ఈ కార్ రేసు అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఛార్జ్ షీట్ కోసం గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, సీఎం అంటే గౌరవంలేకుండా పొగరుగా వ్యవహిరించడం ప్రజాస్వామ్యానికి అవమానకరం అన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా నిధుల దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని ఆరోపించారు.
News November 20, 2025
VZM: ‘ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు’

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి తవిటి నాయుడు అన్నారు. విజయనగరంలోని RIO కార్యాలయంలో గురువారం మాట్లాడారు. ఫిబ్రవరి 23 – మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు 66 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నమన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
News November 20, 2025
హనుమాన్ నగర్లో వ్యక్తి అనుమానాస్పద మృతి

కరీంనగర్లోని హనుమాన్ నగర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడిని కోహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తించారు. మేస్త్రీ పని చేసుకుంటూ కొంతకాలంగా ఒంటరిగా కిరాయి ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


