News April 11, 2025

వనపర్తి జిల్లా RAIN UPDATES

image

వనపర్తి జిల్లా కేంద్రంలో స్వల్ప వర్షపాతం నమోదైంది. గోపాల్‌పేట్ 9.8 మి.మీ, శ్రీరంగాపురం 9.5 మి.మీ, రేవల్లి 9.3 మి.మీ, వనపర్తి 4.5, జానంపేట 3.3, కేతేపల్లి 3.0, పానగల్ 2.5, రేమద్దుల 2.0, పెబ్బేరు 1.8, సోలీపూర్ 1.3, మదనాపూర్ 1.0, వీపనగండ్ల 0.5, పెద్దమందడి, ఘనపూర్, ఆత్మకూరు, అమరచింత, కానాయిపల్లి, అమరచింత, అఙ్గమకూర్, దగడా 0.00 మి.మీగా నమోదయ్యాయి.

Similar News

News December 5, 2025

NLG: గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి: మంత్రి

image

నల్గొండ జిల్లా తిప్పర్తి, జొన్నలగడ్డ గూడెం గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత అభివృద్ధి పనుల కోసం నిధులను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

News December 5, 2025

వారు మాత్రమే ఓటు వేసేలా చూడాలి: కలెక్టర్

image

ఓటరు జాబితాలో ఉన్న వారు మాత్రమే ఓటు వేసేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత పోలింగ్ ఏర్పాట్లపై శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పేపర్లను తప్పకుండా పంపించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

News December 5, 2025

ఎంఈవోలకు కరీంనగర్ కలెక్టర్ కీలక ఆదేశాలు

image

కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎంఈవోలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి పదవ తరగతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రత్యేక అధికారులు పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్ క్లాసులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 20 మంది పిల్లల ఉండాలన్నారు.