News March 22, 2024
వనపర్తి: టీఆర్టీపై శిక్షణ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

ఎస్సి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలకు చెందిన ఎస్సీ అభ్యర్థులకు రెసిడెన్సియల్ పద్దతిలో రెండు నెలల పాటు టీఆర్టీ(DSC)పై ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎ. నుశిత తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదన్నారు. అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోగా http//tsstudycircle.co.in వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News March 11, 2026
దేవరకద్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గండీడు (36.0), భూత్పూర్ (35.7), కోయిలకొండ (35.6) మండలాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంది. చిన్నచింతకుంట, అడ్డాకుల, నవాబుపేట ప్రాంతాల్లో 34 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News March 10, 2026
హెచ్‌సీఏ సెక్రటరీగా పాలమూరు వాసి నియామకం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సెక్రటరీగా పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మన్నే జీవన్ రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఆయన తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి, తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.
News March 10, 2026
MBNR: డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం – కలెక్టర్

జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను కఠినంగా అరికట్టాలని కలెక్టర్ కుష్బూ గుప్త అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు.


