News April 7, 2025

వనపర్తి: తమకు పెళ్లి చేయాలంటూ PSకు ప్రేమ జంట

image

తమకు పెళ్లి చేయాలంటూ ఓ ప్రేమ జంట PSకు వచ్చిన ఘటన వనపర్తి జిల్లా పానగల్‌లో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రేమద్దుల గ్రామానికి చెందిన నందిని(22), మహేందర్(29) రెండేళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అమ్మాయి PSలో ఫిర్యాదు చేసింది. ఇద్దరు మేజర్లు కావడంతో కుటుంబీకులతో పోలీసులు మాట్లాడి ఒప్పించారు. త్వరలో వారి పెళ్లి చేస్తామన్నారు.

Similar News

News November 17, 2025

Wow.. సిద్దిపేట నుంచి ఇండియా టీంకు

image

అక్బర్‌పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పోతనక అభిలాష్ డాడ్జ్‌బాల్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. సిద్దిపేట నుంచి జిల్లా స్థాయికి, జాతీయ స్థాయికి ఎదిగిన అభిలాష్.. క్రికెట్‌తో సహా ఇతర క్రీడల్లోనూ చురుకైన పాత్ర పోషించేవాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో జరిగిన టెస్టులో మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయ జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన అతడిని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.

News November 17, 2025

బుడితి: ఈ హాస్పిటల్‌లో ఏం జరుగుతుంది.. గర్భిణుల మృతితో అలజడి

image

అది ఒక ప్రభుత్వ ఆసుపత్రి.. ఇటీవల కాలంలో ఆ హాస్పిటల్లో గర్భిణులు శస్త్ర చికిత్స అనంతరం మృతి చెందడం కొనసాగుతుంది. దీనిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సారవకోట మండలం బుడితి సీహెచ్సీలో గతంలో ఒకేరోజు ఇద్దరు గర్భిణులు మృతి చెందారు. తాజాగా శనివారం మరో గర్భిణి మృతి చెందింది. దీనిపై అధికారులు సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.

News November 17, 2025

వరంగల్, హనుమకొండను కలిపి ఒకే జిల్లా?

image

WGL, HNKను కలిపి ఒకే జిల్లాగా మార్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు నగరాన్ని ఒకే జిల్లాగా మార్చాలంటూ పదే పదే వేదికల మీద BRSని విమర్శిస్తుండటం తెలిసిందే. ఈ మేరకు గ్రేటర్ WGL‌ను ఒకే జిల్లాగా చేసి, మిగిలిన ప్రాంతాన్ని మరో జిల్లాగా కొనసాగించాలనే నిర్ణయంతో డ్రాఫ్టును జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.