News April 7, 2025
వనపర్తి: తమకు పెళ్లి చేయాలంటూ PSకు ప్రేమ జంట

తమకు పెళ్లి చేయాలంటూ ఓ ప్రేమ జంట PSకు వచ్చిన ఘటన వనపర్తి జిల్లా పానగల్లో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రేమద్దుల గ్రామానికి చెందిన నందిని(22), మహేందర్(29) రెండేళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అమ్మాయి PSలో ఫిర్యాదు చేసింది. ఇద్దరు మేజర్లు కావడంతో కుటుంబీకులతో పోలీసులు మాట్లాడి ఒప్పించారు. త్వరలో వారి పెళ్లి చేస్తామన్నారు.
Similar News
News November 24, 2025
జగిత్యాల: ‘ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి’

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం పలువురి నుంచి ఆయన ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. 57 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బీఎస్ లత, రాజాగౌడ్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
News November 24, 2025
వారంలోగా సమస్యలు పరిష్కరించాలి: కాకినాడ ఎస్పీ

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 42 అర్జీలు వచ్చాయి. వీటిలో భూ తగాదాలు 10, కుటుంబ సమస్యలు 8, ఇతరత్రా 24 ఉన్నట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. అర్జీదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ అర్జీలను వారంలోగా పరిష్కరించాలని, బాధితులకు సత్వర న్యాయం చేయాలని సంబంధిత ఎస్హెచ్వోలను ఎస్పీ ఆదేశించారు.
News November 24, 2025
వరంగల్: భారీగా పతనమవుతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మొక్కజొన్న ధర భారీగా పడిపోతోంది. గతవారం రూ.2,100 పలికిన మక్కలు ధర ఈవారం భారీగా తగ్గింది. నేడు మార్కెట్లో మొక్కజొన్న ధర రూ.1,970కి పడిపోయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే, మార్కెట్లో కొత్త తేజ మిర్చికి రూ.14,500 ధర రాగా.. దీపిక మిర్చికి సైతం రూ.14,500 ధర వచ్చింది.


