News April 8, 2025

వనపర్తి: తహశీల్దార్లు రేషన్ షాపులను తనిఖీ చేయండి: కలెక్టర్

image

వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీపై పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఎక్కడా దొడ్డు బియ్యం, సన్న బియ్యం కలిపి పంపిణీ చేయవద్దని సూచించారు. అలాంటి పనులు ఎక్కడైనా జరిగితే చర్యలు తీసుకుంటామని సదరు రేషన్ షాపు డీలర్ లైసెన్స్ క్యాన్సల్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తహశీల్దార్లు రేషన్ షాపులను విజిట్ చేసి తనిఖీలు చేయాలన్నారు.

Similar News

News October 24, 2025

జగిత్యాల: అక్టోబర్ 27 లాస్ట్ డేట్..!

image

జగిత్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు నామినల్ రోల్(NR) కరెక్షన్ చేసుకోవడానికి అక్టోబర్ 27 చివరి తేదీ అని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి బి.నారాయణ తెలిపారు. గ్రూప్, సెకండ్ లాంగ్వేజ్ లేదా వివరాల్లో సవరణల కోసం కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. తరువాత మార్పులకు అవకాశం లేదని స్పష్టం చేశారు. వివరాలు వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/dvc.doలో చూడొచ్చన్నారు.

News October 24, 2025

అక్టోబర్ 24: చరిత్రలో ఈరోజు

image

1930: నిర్మాత చవ్వా చంద్రశేఖర్ రెడ్డి జననం
1966: నటి నదియా జననం
1980: నటి లైలా జననం
1985: బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త లాస్లో బైరో మరణం
2015: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణం
2017: దక్షిణ భారత సినిమా దర్శకుడు ఐ.వి.శశి మరణం
✿ఐక్యరాజ్య సమితి దినోత్సవం
✿ప్రపంచ పోలియో దినోత్సవం

News October 24, 2025

MBNR: హంస వాహనంపై కురుమూర్తిరాయుడి విహారం

image

ఉమ్మడి MBNR జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు హంస వాహనంపై విహరించారు. భక్తులు గోవింద నామస్మరణతో స్వామివారిని దేవతాద్రి కొండలోని కాంచన గుహ నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగించారు.