News March 27, 2025
వనపర్తి: తాటి ముంజలతో ఉపయోగాలు!

✓ వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లబరుస్తాయి. ✓ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ✓ శరీరంలో వ్యర్థాలను తొలగిస్తాయి. ✓ లివర్ సంబంధిత వ్యాధులు నయమవుతాయి. ✓ జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ✓ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ✓ విపరీతమైన చెమట పట్టినప్పుడు, శరీరం నీటిని కోల్పోయినప్పుడు, తాటి ముంజలు తినడం వల్ల శరీరానికి తిరిగి నీరు లభిస్తుంది. ✓ అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది.
Similar News
News April 25, 2025
కామారెడ్డి: మహిళను కాపాడిన కానిస్టేబుల్

కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ కానిస్టేబుల్ దేవా కుమార్ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించి ఓ మహిళను చాకచక్యంగా రక్షించినందుకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.హనుమంతరావు ప్రశంసించి శాలువాతో సత్కరించారు. సమయస్ఫూర్తితో 100కి సమాచారం ఇచ్చి ఆమెను కాపాడిన దేవా కుమార్‌కు అభినందనలు తెలిపారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. విధి నిర్వహణతో పాటు సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కొనియాడారు.
News April 25, 2025
మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాధవరెడ్డి అరెస్ట్

సంచలనం రేకెత్తించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో స్థానిక రెడ్డీస్ కాలనీకి చెందిన వైసీపీ నేత, రైస్ మిల్ మాధవరెడ్డిని గురువారం రాత్రి తిరుపతి CID పోలీసులు అరెస్టు చేశారు. CID DSP కొండయ్య నాయుడు కథనం ప్రకారం.. ఈ కేసులో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ్ అరెస్టు కాగా.. గురువారం మాధవరెడ్డిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
News April 25, 2025
ఈ వారంలోనే TG టెన్త్ ఫలితాలు!

TG: టెన్త్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. నాలుగైదు రోజుల్లోనే రిజల్ట్స్‌ను విద్యాశాఖ ప్రకటించనున్నట్లు సమాచారం. విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ పరీక్షల విభాగం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. CM రేవంత్ ఆమోదం లభించగానే ఫలితాలను రిలీజ్ చేస్తారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పబ్లిక్ పరీక్షలకు 5 లక్షల మందికి పైగా హాజరయ్యారు.