News June 24, 2024
వనపర్తి: తెల్లవారితే పెళ్లిచూపులు.. అంతలోనే
మరుసటి రోజు ఆ యువకుడికి పెళ్లి చూపులు.. ఉదయంలోగా ఇంటికి వెళ్లేందుకు బైక్ పై బయలుదేరాడు. అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. వనపర్తి జిల్లా చిన్నంబావి మం. లక్ష్మీపల్లికి చెందిన శివశంకర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆదివారం పెళ్లిచూపులు ఉండడంతో బుల్లెట్ బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందాడు.
Similar News
News November 5, 2024
అలంపూర్: అధికారిక చిహ్నం మార్పు.. కలెక్టర్ స్పష్టత
జోగులాంబ గద్వాల జిల్లా, కర్నూల్ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అలంపూర్ వద్ద ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర అధికారులు పెట్టిన బారీకేడ్లపై అధికారిక చిహ్నం మార్పు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీనిపై జోగులాంబ కలెక్టర్ స్పందించారు. వెంటనే తప్పుడు లోగో ఉన్న బారీకేడ్లను తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు.
News November 5, 2024
NRPT: చిరుతపులి దాడిలో మేకలు మృతి !
నారాయణపేట మండలం గనిమోనిబండ గ్రామ శివారులో చిరుతపులి దాడిలో రెండు మేకలు మృతిచెందాయని బాధితులు పేర్కొన్నారు. వెంకటప్ప తన మేకలను మేత కోసం సోమవారం అడవికి తీసుకెళ్ళారు. వాటిలో రెండు కనిపించకపోవడం మంగళవారం అడవిలో వెతకగా రెండు మేకలు మృతి చెంది కనిపించాయి. చిరుతపులి చేసిన దాడిలో మృతి చెందాయని బాధితుడు వాపోయారు. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అయితే చిరుత సంచారంపై క్లారిటీ రావాల్సి ఉంది.
News November 5, 2024
MBNR: కాలేజీల్లో ప్రమాణాలు కోల్పోకుండా చూడాలి !
ఉమ్మడి జిల్లాలో 72 మండలాల్లో 56 ప్రభుత్వ జూ.కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో నిరంతరం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. పాలన అంశాల్లో నిర్ణయం తీసుకోకపోవడం, నిధుల కొరత, మౌలిక వనరుల సమస్యలు దాదాపు అన్ని కళాశాలల్లో ఉన్నాయి. నూతన జూ.అధ్యాపకుల నియామకాలు, ప్రిన్సిపల్ పదోన్నతులు చేపట్టవలసి ఉంది. ప్రభుత్వ జూ.కళాశాలల్లో ప్రమాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.