News March 19, 2025
వనపర్తి: త్వరలోనే ముస్లింలకు ఇఫ్తార్ విందు..

ముస్లింల పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు విషయంపై సమన్వయ సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందు తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.
Similar News
News October 14, 2025
VKB: ‘పిల్లలు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలి’

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో మంగళవారం జూమ్ ద్వారా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ పిల్లలతో మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలు, ఆరోగ్యం, విద్య గురించి వివరాలు తెలుసుకున్నారు. శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిన ఆర్థిక సహాయం గురించి కూడా ఆరాతీశారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకు ఎంతో అవసరమని తెలిపారు.
News October 14, 2025
సిద్దిపేట: ‘సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ అన్నారు. క్షేత్రస్థాయిలో పారామెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం DMHO కార్యాలయంలో పారామెడికల్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కేంద్రాల వారీగా కార్యక్రమాల పనితీరుపై సమీక్ష చేశారు.
News October 14, 2025
దీపావళి నేపథ్యంలో భద్రతా చర్యలు తప్పనిసరి: కలెక్టర్

దీపావళి పండుగ సందర్భంగా అనుమతులు, భద్రతా చర్యల విషయంలో సంబంధిత అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. టపాసుల హోల్సేల్ స్టాక్ షెడ్లు, తాత్కాలిక దుకాణాలకు వచ్చే దరఖాస్తులను రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖల త్రిసభ్య కమిటీ ద్వారా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.