News April 5, 2025
వనపర్తి: త్వరితగతిన పనులు పూర్తి చేయాలి: చిన్నారెడ్డి

వనపర్తి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏటీసీ తరగతులను నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన మెటీరియల్ ఇప్పటికే ఇక్కడికి చేరింది. ఏటీసీకి అవసరమైన విధంగా భవనాన్ని సిద్ధం చేయనున్నారు. ఈ పనులను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. బోధన, అధ్యాపక బృందంతో ఆయన మాట్లాడారు.
Similar News
News December 3, 2025
సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్

TG: తరం మారింది. తలరాతలు మార్చే ప్రచార వేదికలూ మారుతున్నాయి. ప్రతి ఒక్కరి చేతుల్లోని స్మార్ట్ ఫోన్ను చేరేలా పంచాయతీ అభ్యర్థుల ప్రచారం సాగుతోంది. దీంతో గోడలపై, ఇళ్లకు పోస్టర్లు, మైకుల సందడికి సోషల్ మీడియా అదనంగా చేరింది. రెగ్యులర్ ఆఫ్లైన్ క్యాంపెయిన్లతో పాటు వాట్సాప్లో వీడియోలతోనూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ఊరి వాట్సాప్ గ్రూప్స్లో డిస్కషన్స్ పోల్స్ రిజల్ట్ను బట్టి హామీలు, వ్యూహాలూ మారుతున్నాయి.
News December 3, 2025
అమరావతి: సచివాలయంలో బారికేడ్ల తొలగింపు

అమరావతి సచివాలయంలో ఇనుప బారికేడ్లను తొలగించారు. బారికేడ్ల వల్ల ప్రజలు, సందర్శకులు ఇబ్బంది పడుతున్నారని గమనించిన సీఎం చంద్రబాబు.. వెంటనే వాటిని తొలగించాలని పోలీసులను ఆదేశించారు. బ్లాకుల ముందు బారికేడ్లకు బదులుగా పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన బారికేడ్లను తొలగించి, ఆ స్థానంలో అందమైన క్రోటాన్, పూల మొక్కలను ఏర్పాటు చేశారు.
News December 3, 2025
మహబూబాబాద్: నేడు మూడో దశ నామినేషన్లు

జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ బుధవారం జరగనుంది. కురవి, కొత్తగూడ, మరిపెడ, గంగారం, డోర్నకల్, సీరోల్ మండలాల్లోని 169 సర్పంచ్ స్థానాలకు, 1,412 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు.


