News February 13, 2026

వనపర్తి: నియమావళి ఉల్లంఘిస్తే రిమాండ్: SP

image

ఎన్నికల ఫలితాల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని SP సునీత రెడ్డి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీలు చేపడితే రిమాండ్‌కు పంపిస్తామన్నారు. ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని, గొడవలకు తావులేకుండా శాంతి సామరస్యాలు కాపాడాలని ఆమె కోరారు.

Similar News

News March 9, 2026

మహిళలూ HYD వెళ్తున్నారా… అయితే త్వరలో మీకోసం ఓ యాప్

image

TG: విద్య, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి HYDకి వచ్చే మహిళల కోసం ఓ యాప్‌ను GOVT తెస్తోంది. వారికి వసతి, భద్రత కల్పించే లక్ష్యంతో దీన్ని రూపొందిస్తోంది. యాప్ ద్వారా GOVT, గుర్తింపు పొందిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలోని రూములను ముందుగా బుక్ చేసుకోవచ్చు. హాస్టళ్లలో CCTV కెమెరాలు, సెక్యూరిటీతో పటిష్ఠ ఏర్పాట్లుంటాయి. TNలో అమల్లో ఉన్న ఇలాంటి యాప్‌ను పరిశీలించిన అధికారులు త్వరలో ఇక్కడా ప్రారంభించనున్నారు.

News March 9, 2026

ICC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇదే

image

T20WC-2026 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రకటించింది. 11 మందిలో భారత్ నుంచి నలుగురికి చోటు దక్కింది. సౌతాఫ్రికా ప్లేయర్ మార్క్రమ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది.
టీమ్: సంజూ శాంసన్, ఫర్హాన్ (పాక్), ఇషాన్ కిషన్, మార్క్రమ్ (C), హార్దిక్ పాండ్య, విల్ జాక్స్, జేసన్ హోల్డర్, బుమ్రా, ఎంగిడి, ఆదిల్ రషీద్, ముజరబానీ (జింబాబ్వే).
*12వ ఆటగాడిగా స్కాల్విక్ (USA)
> జట్టు ఎలా ఉందో COMMENT చేయండి.

News March 9, 2026

భూపాలపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ ఏర్పాటు: కలెక్టర్ పరిశీలన

image

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో MRI సేవలు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆసుపత్రిని సందర్శించి, ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటుకు కేటాయించిన గదులు, మౌలిక వసతులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు త్వరగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సౌకర్యంతో పేద రోగులకు వ్యయప్రయాసలు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు.