News April 14, 2025
వనపర్తి: ‘నిరంతర పోరాట స్ఫూర్తి కామ్రేడ్ జార్జిరెడ్డి’

ఉస్మానియా విశ్వవిద్యాలయం అణుభౌతిక శాస్త్రంలో బంగారు పతకం పొందిన మేధావి, విప్లవవాది జార్జిరెడ్డి 53వ వర్ధంతిని పురస్కరించుకొని వనపర్తి పీడీఎస్యూ కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు కె.పవన్ కుమార్ మాట్లాడుతూ.. విద్యా, సామాజిక రంగాల్లో అణచివేతలకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
HLL లైఫ్కేర్ లిమిటెడ్లో 354 పోస్టులు

<
News November 6, 2025
విభిన్న ప్రతిభావంతులకు ఉచిత మూడు చక్రాల మోటార్ సైకిళ్లు

ఏలూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్తో నడిచే మూడు చక్రాల మోటార్ సైకిళ్లను ఉచితంగా అందిస్తున్నామని ఆ శాఖ జిల్లా మేనేజర్ రామ్ కుమార్ బుధవారం తెలిపారు. అర్హత గల 18 నుంచి 45 ఏళ్ల వారు www.apdascac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తు, ఇతర పత్రాలను నవంబర్ 25లోగా ఏలూరు కార్యాలయంలో అందించాలని ఆయన స్పష్టం చేశారు.
News November 6, 2025
రాజాం: పాము కాటుకు గురైన రైతులు

రాజాం మండలంలో పొలం పనులు కొనసాగుతుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా విషకీటకాల బారినపడుతున్నారు. పాము కాటు బాధితుల్లో 90% మంది వీరే ఉంటున్నారు. మండలంలో అమరం గ్రామానికి చెందిన శంకర్రావు, సంకిలి గ్రామానికి చెందిన శివ, కింజంగి గ్రామానికి చెందిన శ్రీరాము, పెంట గ్రామానికి చెందిన ఆదినారాయణ వరికోతలు చేస్తుండగా బుధవారం పాము కాటుకు గురయ్యారు. వీరు రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


