News April 14, 2025
వనపర్తి: ‘నిరంతర పోరాట స్ఫూర్తి కామ్రేడ్ జార్జిరెడ్డి’

ఉస్మానియా విశ్వవిద్యాలయం అణుభౌతిక శాస్త్రంలో బంగారు పతకం పొందిన మేధావి, విప్లవవాది జార్జిరెడ్డి 53వ వర్ధంతిని పురస్కరించుకొని వనపర్తి పీడీఎస్‌యూ కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు కె.పవన్ కుమార్ మాట్లాడుతూ.. విద్యా, సామాజిక రంగాల్లో అణచివేతలకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు.
Similar News
News April 23, 2025
జనగామ: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ సచివాలయం నుంచి సీఎస్ శాంతి కుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌లతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జనగామ జిల్లా కలెక్టరెట్ నుంచి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొన్నారు. అన్ని మండలాల్లో ఈ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
News April 23, 2025
ఇందన్‌పల్లి బీట్ ఆఫీసర్‌పై దాడి.. ఇద్దరి రిమాండ్

ఇందన్‌పల్లి అటవీ అరేంజ్ పరిధిలోని భర్తనిపేట బీట్ ఆఫీసర్ రుబీనాతలాత్‌పై దాడి చేసిన మహమ్మద్ రియాజుద్దీన్, ఇజాజుద్దీన్‌లను రిమాండ్‌కు తరలించారు. మంగళవారం వారిని కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి వారికి 14 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినా, కలప అక్రమ రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News April 23, 2025
మల్దకల్: ఫెయిలవుతాననుకున్నాడు.. కానీ పాసయ్యాడు!

మల్దకల్(M) ఓ విద్యార్థి తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతానని నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ విద్యార్థి ఫెయిల్ కాకపోగా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. గ్రామస్థుల వివరాలు.. మల్లెందొడ్డికి చెందిన వినోద్ ఇంటర్ 1st YEAR చదువుతున్నాడు. ఫెయిల్ అవుతాననే భయంతో నిన్న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నేడు ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. దీంతో బాధితకుటుంబం శోకసంద్రంలో మునిగింపోయింది.