News March 27, 2025
వనపర్తి: నీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కేంద్రంలో బుధవారం ఉదయం పట్టణానికి చెందిన మహిళలు ఆందోళన చేశారు. నీటి సరఫరా చేయాలంటూ ఖాళీ బిందెలతో మహిళలు మెయిన్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీలో నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కనీసం నీటి ట్యాంకర్నైనా పంపించాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 23, 2025
HYD: కాంగ్రెస్కి కొత్త అధ్యక్షులు.. ఎవరీ ముగ్గురు?

జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ అధిష్ఠానం నియమించింది. HYD, ఖైరతాబాద్, సికింద్రాబాద్ ప్రెసిడెంట్లుగా సయ్యద్ షఫీ ఉల్లా, రోహిత్ ముదిరాజ్, దీపక్ జాన్ నియమితులయ్యారు. షఫీ ఉల్లా ఏఐసీసీ డేటా టెక్నాలజీ సెల్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రోహిత్ ముదిరాజ్ యువజన కాంగ్రెస్ నాయకుడిగా చురుగ్గా ఉంటున్నారు. ఇక దీపక్ జాన్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్గా సేవలందిస్తున్నారు.
News November 23, 2025
HYD రూపురేఖలు మార్చేసే ‘హిల్ట్’ పాలసీ!

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP)కి ఆమోదం తెలిపింది. దీని ద్వారా బాలానగర్, కటేదాన్ వంటి నిరుపయోగ పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్లుగా మారుస్తారు. ఈ స్థలాల్లో ఇకపై నివాస, వాణిజ్య, ఐటీ నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. స్థలం వెడల్పును బట్టి SRO ధరల్లో 30%- 50% డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు (DIF) చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు 6 నెలల్లోపు TG IPASS ద్వారా సమర్పించాలి.
News November 23, 2025
ప్రతి ఇంటికి బైక్ ఉండాలన్నదే నా లక్ష్యం: విజయ్

వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి తథ్యమని TVK పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. కరూర్ తొక్కిసలాట తర్వాత ఆయన తొలిసారిగా కాంచీపురం సభలో మాట్లాడారు. ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. DMK తమకు రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విజయ్ ఆరోపించారు.


