News March 15, 2025
వనపర్తి: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్23 వరకు ఈ హాఫ్డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్24 నుంచి జూన్11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ ఓపెన్.
Similar News
News October 20, 2025
నల్గొండ: రేకుల షెడ్లో ఉంటున్నాం.. ఇల్లు ఇవ్వరూ..!

త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు దక్కడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా నాయకులు అనర్హులకు ఇళ్లను కేటాయించి తమను విస్మరిస్తున్నారని కొల్లి సరస్వతి, దుర్గయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేకుల షెడ్లో నివసిస్తున్నామని, అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
News October 20, 2025
కామారెడ్డి: రోడ్లపై మృత్యు రాశులు

రైతుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలను పోతున్నాయి. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై పోలీసులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా రైతులు పెడచెవిన పెడుతున్నారు. ఈ నెల 18న కామారెడ్డి జిల్లా తాడ్వాయి PS పరిధిలో రోడ్డుపై ఆరబెట్టిన మొక్కజొన్న కుప్పపై బైక్ దూసుకెళ్లడంతో గంగారెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. రైతుల నిర్లక్ష్యంపై వాహనదారుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News October 20, 2025
మీరు కొన్న టపాసుల హయ్యెస్ట్ ప్రైస్ ఎంత?

దీపావళి పిల్లలకు ఒక ఎమోషన్. దాచి పెట్టుకున్న డబ్బులతో పాటు పేరెంట్స్ వద్ద చిన్నపాటి యుద్ధం చేసైనా కావాల్సిన మనీ సాధించి టపాసులు కొనాల్సిందే. పండుగకు ముందు నుంచే రీల్ తుపాకులు, ఉల్లిగడ్డ బాంబులు కాలుస్తూ సంబరపడే బాల్యం దీపావళి రోజు తగ్గేదేలే అంటుంది. క్రాకర్స్ వెలుగుల్లో నవ్వులు చిందించే పిల్లల ముఖాలు చూసి పేరెంట్స్ సైతం మురిసిపోతారు. ఇంతకీ చిన్నప్పుడు మీరు కొన్న క్రాకర్స్ హయ్యెస్ట్ ప్రైస్ ఎంత?