News April 11, 2025
వనపర్తి: పంట చేతికొచ్చే దశలో నష్టపోతున్న రైతులు

వనపర్తి జిల్లా కేంద్రంతో సహా పలు గ్రామాల్లో నిన్న సాయంత్రం ఈదురుగాలులతో పాటు వర్షం కురిసింది. ఉక్కపోతతో అలమటిస్తున్న ప్రజలు వర్షం కురవడంతో వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది. అటు పలు గ్రామాల్లో వరి కోత దశలో వర్షం పడడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పలుచోట్ల భారీ ఈదురుగాలులతో మామిడికాయలు నేలకొరిగాయని, పంట చేతికొచ్చే దశలో నష్టపోతున్నామని రైతులు తెలిపారు.
Similar News
News December 4, 2025
చిత్తూరు: టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నియమిస్తామని డీఈవో వరలక్ష్మి చెప్పారు. జిల్లాలో 34 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేలు జీతం ఉంటుందన్నారు.
News December 4, 2025
రంగారెడ్డి కలెక్టరేట్లో ACB దాడులు

రంగారెడ్డి కలెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే, ల్యాండ్స్ రికార్డు ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏడీ సర్వేయర్ శ్రీనివాస్కు చెందిన గచ్చిబౌలిలోని మైత్రి హోమ్స్లోని ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో 3 బృందాలుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
News December 4, 2025
చండూరు: సర్పంచ్ బరిలో అక్కాచెల్లెళ్లు

చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు బరిలో నిలవడంతో ప్రజల్లో ఉత్కంఠ పెరిగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా కావలి స్వాతి పోటీ చేస్తుండగా, కావలి శివాని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యే గట్టి పోటీ ఉంటుందని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.


